మెగాస్టార్ వారసుడిగా చిరుత సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తేజ్ ప్రేక్షకుల మనసుని గెలుచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. పేరు కి స్టార్ కిడ్ అయినా అందరితోనూ సామాన్య వ్యక్తిలానే నడుచుకుంటాడు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. ప్రేక్షకులకు నచ్చిన విధంగా తనని తాను మార్చుకుంటూ నేడు ఈ స్థాయికి చేరుకున్నారు చెర్రీ.