బుల్లితెర రాములమ్మగా ప్రముఖ తెలుగు యాంకర్ శ్రీ ముఖి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పటాస్ షోతో అభిమానులను పెంచుకున్న ఈ భామ బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తన సత్తా చాటాలని ఎంతో ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ రియాల్టీ షో లో పాల్గొన్న తర్వాత ఈమె క్రేజ్ డబుల్ అవ్వడమే కాదు, అవకాశాలు కూడా అదే తరహాలో వచ్చాయి.