నందమూరి కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ కుటుంబానికి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. ఆనాటి స్వర్గీయ నందమూరి తారకరామారావు నుండి నేటి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వరకు సినిమానే జీవితంగా కొనసాగిస్తున్నారు. సినిమా అన్నా, కళామతల్లి అన్నా ఈ కుటుంబానికి ప్రాణం కన్నా ఎక్కువే.