సినిమా అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్. మనిషి మనసు బాగాలేనప్పుడు సినిమా చూస్తాడు. అలాగే సంతోషంగా ఉన్నా కూడా సినిమా చూస్తాడు. కానీ అంతిమంగా ఒక ప్రేక్షకుడికి వినోదం కావాలి. వినోదంలో భాగంగా రకరకాల జోనర్ లో సినిమాలు తెరకెక్కుతుంటాయి. అన్ని జోనర్ లలో కామెడీ ప్రధానంగా వచ్చే సినిమాలు ఎక్కువ వినోదాన్ని ప్రేక్షకులకు అందిస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.