బాలయ్య నిజ స్వరూపం గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు సినీ నిర్మాత చంటి అడ్డాల. చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర హీరోలతో పలు సినిమాలను నిర్మించిన చంటి అడ్డాల.. బాలయ్య ఇచ్చిన మాట పట్ల ఎంత కమిట్మెంట్ తో ఉంటారో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బాలయ్య కు తనకి మధ్య జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటూ.. పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు..