ప్రస్తుతం వైవిధ్యభరిత పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరో నుంచి విలన్ వరకు కీలక పాత్ర ఏదైనా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించడంలో ఆయన నెంబర్ వన్. తెలుగు, తమిళం మరియు హిందీ ఇలా పలు భాషల్లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో.