బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రేణు దేశాయ్ ఆ చిత్రంలో తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత జానీ సినిమాలో హీరోయిన్ గా చేశారు. అప్పటికే పవన్ తో ప్రేమలో పడిన రేణు దేశాయ్ 2009 లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి అపూర్వమైన ప్రేమకు కానుకగా అఖీరా నందన్ (కొడుకు) మరియు ఆద్య (కూతురు) ఇద్దరు పిల్లలు ఉన్నారు.