తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలలో అప్పటి వరకు వచ్చిన ప్రేమకథ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన చిత్రం ప్రేమిస్తే. 2004 లో తమిళ్ లో విడుదలైన కాదల్ మూవీకి ఇది తెలుగు డబ్ మూవీ. ఈ సినిమా కథ ఒక విషాద ప్రేమకథ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన మురళి (భరత్) మరియు ఐశ్వర్య (సంధ్య) లు తమ నటనతో సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లారు.