నాన్న పైకి గంభీరంగా కనిపించినా తన గుండె చాటున పిల్లలపై సముద్రమంత ప్రేమ దాచుకుంటాడు. అమ్మ ప్రేమ అపారం అనంతం. నాన్న ప్రేమ అద్భుతం. ఈ ప్రపంచంలో మనకు దగ్గరైన వారితో ఏ బంధం అయినా కలుపుకుని మాట్లాడుతుంటాం. అక్క, అన్న, అత్త, బాబాయ్, బామ్మ చివరికి మన మనసుకు బాగా దగ్గరైన వారిని మనపై తల్లిలా ప్రేమ కురిపించే వారిని అమ్మ అని సంబోధిస్తూ బంధం కలుపుకుంటాం.