తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా రాణించడానికి ఎంతోమంది వస్తుంటారు. కానీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే తనదైన ముద్రవేసి ఇండస్ట్రీలో పాతుకుపోతారు. ఇందులో ముఖ్యంగా వారి నటనా సామర్ధ్యం మరియు అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు అంశాలలో ఏది కలిసి రాకపోయినా ఒక మాములు నటుడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది.