ఇండియన్ సినిమా చరిత్రలో వివిధ జోనర్ లలో సినిమాలు చేస్తూ మన డైరెక్టర్స్ భారతదేశ ఖ్యాతిని రెట్టింపు చేస్తుంటారు. అయితే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కో రకమైన సినిమాలను చేయడంలో సిద్దహస్తులై ఉంటారు. కామెడీ, లవ్, సెంటిమెంట్, హార్రర్, పాట్రియాటిక్, ఫ్యామిలీ ఎంటెర్టైనర్స్, యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్ ఇలా ఎన్నో రకాల జోనర్ లలో సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి.