బిగ్ బాస్ సీజన్ 4 రియాలిటీ షో తో సెలబ్రిటీ గా మారిన ఆరియానా గ్లోరీ గురించి అందరికీ తెలిసిందే. ఈమె బిగ్ బాస్ లో అవినాష్ తో కలిసి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ షోలో తన అద్భుతమైన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఆ షోలో ముక్కుసూటిగా మాట్లాడే అమ్మాయిగా, ఇంటెలిజెంట్ గేమ్స్ తో పాటు, ఫిజికల్ గేమ్స్ లోనూ తన సత్తా చాటింది.