తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడు అనగానే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చెప్పే ఒకే పేరు బ్రహ్మానందం. ఆనందం అనేది ఆయన పేరులోనే కాదు ఆయన ప్రతి కణంలోనూ అల్లుకుపోయింది. అందుకే తన సరదా మాటలతో, అదిరిపోయే పంచులతో ప్రేక్షకులను అవలీలగా నవ్వించి కవ్వించ గలరు.