ప్రస్తుతం కరోనా వైరస్ కాస్త గ్యాప్ ఇచ్చినట్లుంది. మళ్ళీ ఎప్పుడు మూడవ దశపేరుతో మన ముందుకొస్తుందో తెలియని పరిస్థితి. లాక్ డౌన్ పరిమితులను కూడా ఎత్తివేయడంతో సినిమా ఇండస్ట్రీకి ఊరట లభించింది. ఇంతకు ముందు కరోనా కారణంగా షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాలన్నీ షూటింగ్ ను మొదలు పెట్టడానికి చక చకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.