తేజ దర్శకత్వం వహించిన "చిత్రం" సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ వాస్తవ్యుడు హీరో ఉదయ్ కిరణ్ అనతికాలంలోనే సునామీలా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఈ హీరో నుండి వచ్చిన నువ్వు నేను, మనసంతా నువ్వే రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో హ్యాట్రిక్ హీరోగా గుర్తింపు పొందాడు.