ప్రస్తుత తమిళ్ లో సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న అతి కొద్దిమంది డైరెక్టర్ లలో యువ దర్శకుడు అట్లీకి ప్రత్యేక స్థానముంది. అట్లీ ప్రముఖ ఇండియన్ డైరెక్టర్ శంకర్ దగ్గర రెండు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అతి తక్కువ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి తనదైన దర్శకత్వ శైలితో తమిళ ఇండస్ట్రీలో హిట్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు.