సినిమా ఇండస్ట్రీ ఒక అద్భుతమని చెప్పాలి. ఎప్పుడు ఎలాంటి అద్భుతం జరుగుతుందో తెలియదు. మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ లేదా హీరో ఒక్కసారిగా ప్లాప్ సినిమాల బాట పట్టొచ్చు. అలాగే ప్లాప్ లతో సతమవుతున్న హీరో లేదా డైరెక్టర్ ఒక్క సినిమాతో వారి రేంజ్ మారిపోవచ్చు. అదే విధంగా అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న కార్తికేయకి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాను అందించాడు డెబ్యూ డైరెక్టర్ అజయ్ భూపతి.