హీరో అల్లరి నరేష్ ...తెలుగు చలన చిత్ర సీమ ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ద్వితీయ పుత్రుడు అన్న విషయం తెలిసిందే. మూవీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్. తన ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేకమైన జోన్ ని ఏర్పాటు చేసుకున్నాడు. "అల్లరి" సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ కథానాయకుడు, ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచి అల్లరి నరేష్ గా ప్రఖ్యాతి పొందాడు.