కరోనా కారణంగా అన్ని పరిశ్రమలు దారుణంగా నష్టపోయాయి. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమా పరిశ్రమ కూడా అందులో ఉంది. గత రెండేళ్లుగా ఎన్నో సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడడంతో మళ్ళీ ఆగిపోయిన సినిమాలను కంప్లీట్ చేసి విడుదల చెయ్యడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.