యూత్ ఐకాన్ అల్లు అర్జున్ సోదరుడు, టాలీవుడ్ అగ్ర నిర్మాత తనయుడు అల్లు శిరీష్ 2013వ సంవత్సరంలో గౌరవం చిత్రంతో ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని శిరీష్ కు అందించలేకపోయింది. ఇక ఈ కుర్ర హీరో తీసిన రెండో మూవీ "కొత్త జంట" ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని అందించి శిరీష్ ను నిలబెట్టింది.