మణికర్ణిక దర్శకుడు ఎవరన్న విషయంపై బాలీవుడ్ టు టాలీవుడ్ ఎంతపెద్ద చర్చ జరిగిందో అందరికి తెలిసినదే. కంగనా రనౌత్ ప్రదాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను మొదట క్రిష్ 80 శాతం వరకు డైరెక్ట్ చేయగా మధ్యలో క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తడంతో ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నారు. అ తర్వాత కంగనా మిగిలిన భాగాన్ని డైరెక్ట్ చేసి పూర్తి చేసింది. అప్పట్లో ఈ అంశంపై పెద్ద కాంట్రవర్సీనే నడిచింది.