అచ్చ తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ "మల్లేశం" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమా తోనే ప్రేక్షకులను మెప్పించిన ఈ భామ ఆ తర్వాత "ప్లేబ్యాక్" సినిమాతో అభిమానుల సంఖ్యను మరింత పెంచుకుంది. ఆ తర్వాత "వకీల్ సాబ్" చిత్రంతో తన క్రేజ్ ను అమాంతం పెంచేసింది ఈ బ్యూటీ.