కరోనా పీరియడ్ లో ఆర్థిక కష్టాలు, ఆరోగ్య కష్టాలే కాదు పచ్చగా ఉన్న కాపురాలు కూడా భగ్గుమంటున్నాయి. బిల్ గేట్స్ వంటి ప్రముఖులు సైతం తన భార్యతో విడాకులు తీసుకొని షాకిచ్చారు. ఆ షాక్ నుండి తేరుకోక ముందే బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ కూడ తన సతీమణితో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించడం గమనార్హం.