కరోనా పుణ్యమా అని సినిమా ఇండస్ట్రీలు అన్నీ సంకట స్థితిలో పడ్డాయి. ఎన్నో కోట్ల బడ్జెట్ తీసిన సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. దీనికి కారణం థియేటర్లను మూసి వేయడమే. ఎప్పుడు కరోనా వస్తుందో తెలియదు, లాక్ డౌన్ ఎప్పుడు వేస్తారో తెలియదు. చాలా సినిమాలు మాత్రం షూటింగ్ లు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.