పేరుకి మలయాళ నటి అయినా చూడగానే అచ్చ తెలుగమ్మాయిలా మనసులో భావం కలుగుతుంది. చక్కటి చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాన్ని దోచుకున్న నటి రేవతి. రేలంగి నరసింహారావు డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ‘మానసవీణ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన రేవతి గొప్ప గుర్తింపు సాధించి ఎన్నో చిత్రాలలో తనదైన శైలిలో నటించి అలరించింది.