సాధారణంగా డైరెక్టర్ హీరో, లేదా హీరో హీరోయిన్ల కాంబినేషన్ లు ఎక్కువగా రిపీట్ అవ్వడం చూస్తూనే ఉంటాం. ఓ సారి సూపర్ హిట్ అందుకున్నారు అంటే, తిరిగి రిపీట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే డైరెక్టర్ హీరోయిన్ కాంబినేషన్ లో మాత్రం చాలా తక్కువగానే ఉంటాయి. కానీ మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రం తనకు అచ్చొచ్చిన హీరోయిన్లకు వరుస ప్రాజెక్టులలో అవకాశం ఇస్తూ ఉంటారు.