రంగస్థలం నుండి రంగుల ప్రపంచానికి చేరి తనదైన శైలిలో నటనను ప్రదర్శించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు ప్రముఖ తెలుగు సినీ నటుడు తనికెళ్ల భరణి.1956 జూలై 14 న పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మడలంలోని జగన్నాధపురంలో జన్మించారు ఈ సినీ ధ్రువ తార. "చల్ చల్ గుర్రం" నాటకం ఒక విధంగా ఈయన సినిమాల్లోకి రావడానికి కారణమని చెప్పాలి.