మామూలుగా చాలా మంది కథానాయకులు నటనకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. వారి నటనను మరింత మెరుగు పరుచుకుంటూ అందిన అవకాశాలను చేసుకుంటూ పోతారు. ఎక్కువగా రిస్కీ ఫాక్టర్స్ జోలికి వెళ్లరు. కానీ కొందరు హీరోలకు మాత్రం నటన మాత్రమే కాకుండా రచన, దర్శకత్వం, నిర్మాణ రంగం వంటి విషయాలపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది.