టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్టుల సంఘం గురించి జరుగుతున్న చర్చలు మరియు వివాదాల గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం సొంత భవంతి నిర్మాణం పైనే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. `మా` కోసం సువిశాలంగా ఎకరం స్థలంలో 'మా' సొంత భవంతిని నిర్మించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నప్పటికీ ఇంత వరకు సాధ్య పడలేదు.