మా టీవీ లో గత అయిదు సంవత్సరాల నుండి సీజన్ ల వారీగా బిగ్ బాస్ రియాలిటీ షోకి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది అంటే మాటల్లో చెప్పడం కాస్త కష్టమే. ఈ షో వచ్చిందంటే ఇక అందరూ మా ఛానల్ కే అతుక్కుపోతారు. అంతగా ఈ షో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మొదట్లో బిగ్ బాస్ షో ఒక బిగ్ సెలబ్రిటీ షో అనిపించగానే ఆ పేరు మూడు, నాలుగు సీజన్లలో పెద్దగా కనిపించలేదు. ఈ రెండు సీజన్లలో వచ్చిన కంటెస్టెంట్లు చాలా మంది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివారే.