కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా' ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడంలో సక్సెస్ అయింది. అంతే కాకుండా అప్పట్లో నాగార్జునకు కెరియర్ పరంగా కూడా ఈ సినిమా చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. ఈ చిత్రంలో నాగ్ చేసిన బంగార్రాజు పాత్రను ప్రేక్షకులు ఎన్నటికీ మరువలేరు.