టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి చిత్రంలో రొమాంటిక్ హీరోగా యూత్ ని పరుగులు తీయించి, గీతా గోవిందం సినిమాతో మిస్టర్ పర్ఫెక్ట్ లా కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకని మోస్ట్ వాంటెడ్ హీరోగా టాలీవుడ్ టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు.