జబర్దస్త్ షో తో వెలుగులోకి వచ్చి సెలబ్రిటీగా మారిన అనసూయ.గ్లామర్ కి కొత్త అర్థాన్ని చెబుతూ అభిమానుల సంఖ్యను రోజురోజుకీ పెంచుకుపోతోంది. బుల్లి తెర పైనే కాకుండా వెండి తెరపై కూడా తన సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో నాగ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది అనసూయ భరద్వాజ్.