స్టైలిష్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి సూపర్ ఫిల్మ్స్ తర్వాత బన్నీ, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సారి వస్తోన్న చిత్రం ఇది. ఈ మూవీలో రష్మికా మందన్నా అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయాలని షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు.