ప్రస్తుతం టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ మంచి ఊపుమీద ఉన్నాడు. 2017 లో వచ్చిన 'రాజా ది గ్రేట్' తరువాత వరుసగా మూడు సినిమాలు పరాజయం పాలవ్వడంతో రవితేజ కెరీర్ ప్రమాదంలో పడింది. కానీ అంతలోనే మళ్ళీ గోపిచంద్ మలినేని 'క్రాక్' లాంటి సినిమా తీసి మరిచిపోలేని హిట్ ఇచ్చాడు.