వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా రయ్ మంటూ దూసుకొచ్చిన రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత వెను తిరిగి చూసింది లేదు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా అందరి యంగ్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. గ్లామర్ ను వలకబోసిన ఈ చిన్నది తన అభినయంతో ప్రేక్షకుల మన్నలను పొందింది. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో రకుల్ జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి.