నందమూరి అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు.అతి త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుందని వెల్లడించారు థమన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవల తమిళనాడులో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేయాలని మూవీ టీమ్ భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి పాటతో అఖండ ప్రమోషన్స్ ను మొదలు పెట్టనున్నారట.