ఎంతో మంది నటులు సినిమాలలో అలా తారజువ్వల్లా మెరిసి మాయమౌతుంటారు. కొందరు మాత్రమే అబ్బురపరిచే నటనతో ప్రేక్షకులను ప్రసన్నం చేసుకుని ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం రాణించగలుగుతారు. అటువంటి నటులలో శ్రీహరి కూడా ఒకరు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చి తన పట్టుదల, ప్రతిభతో ఇండస్ట్రీలో నటుడిగా అసాధారణ స్థాయికి చేరుకున్నాడు.