నామినేషన్స్ లో హగ్ విషయాన్ని ప్రస్తావిస్తూ..'నువ్వు మగాళ్లతో బిజీ అని లాహరికి చెప్పింది.ఇక ఆ గొడవ పెద్దగా మారి అందులో రవి ఇరుక్కున్నారు.అయితే తాను సింగిల్ మెన్ అనే మాటే అనలేదని ప్లేట్ పిరాయించాడు.నువ్వు అన్నావ్ కదా అని ప్రియ నిలదీసినప్పటికి తను అనలేదని బుకాయించాడు రవి.ఈ విషయం గురించి మరింత క్లారిటీ ఇవ్వడానికి లహరి ని పవర్ రూమ్ కి పంపించాడు నాగ్.ఇక అందులో రవి లహరి గురించి బ్యాడ్ గా మాట్లాడిన వీడియో చూపించడంతో అతడి నిజ స్వరూపం బయటపడింది.