'అఖండ' సినిమా దసరా కానుకగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ..  అఖండ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.అయితే దసరాకు సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అఖండ మేకర్స్ నుండి ప్రకటన రాకపోవడంతో దసరా బరిలో బాలయ్య లేనట్టేనని తెలుస్తోంది.