పవన్ కళ్యాణ్, మహేశ్ బాబులు మధ్య టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి పోటీ ఏర్పడిన నేపధ్యంలో వీళ్ళ సూపర్ స్టార్ ఇమేజ్ లో వీరిద్దరూ ప్రస్తుతం బంధీలుగా మారిపోయారు అనేది ఎవరు కాదనలేని వాస్తవo. వీళ్ల సినిమాలు విడుదలకు దగ్గర పడుతున్నాయంటే అభిమానులకు పండగ బయ్యర్లకు టెన్షన్. ఇప్పడు అదే జరిగింది మరియు జరుగుతోంది.
ఇప్పటికే సర్దార్ తో బయ్యర్లు ఏకంగా 40 కోట్లకు పైగా మునిగి పోయారు అని వార్తలు వస్తున్నాయి. పవన్ ‘సర్దార్’ ఇచ్చిన ఇచ్చిన షాక్ తో మహేష్ బాబులోనూ ఖంగారు మొదలైంది అని టాక్. గత సంవత్సరం ‘శ్రీమంతుడు’ ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసి 90 కోట్లకు పైగా వసూలు చేసిన నేపధ్యంలో ‘బ్రహ్మోత్సవం’ పై భారీ అంచనాలు ఏర్పడి భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది.
ఇప్పుడు ఆ విశ్వాసమే మహేష్ ను కలవర పెడుతోంది అని అంటున్నారు. అంచనాలు మరీ ఎక్కువైపోతే ఒక్కోసారి అసలుకే మోసం వస్తుంది అన్న విషయo పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తో మహేష్ కు బాగా భోదపడింది అని అంటున్నారు. అందుకే ‘బ్రహ్మోత్సవం’ పై వీలైనంత వరకు లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తున్నాడు సూపర్ స్టార్. ఇది ఇలా ఉండగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు ఆడియో ఫంక్షన్ భారీ స్థాయిలో చేయాలా వద్దా అనే ఆలోచనల మధ్య మహేష్ ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
దీనికితోడు ‘బ్రహ్మోత్సవం’ ఎప్పుడు విడుదల చేయాలి అన్న క్లారిటీ ఇప్పటికీ మహేష్ కు ఏర్పడలేదు అని అంటున్నారు. ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ పై కొన్ని సందేహాలు ఉన్న మహేష్ ఈ సినిమాను మే నెలలో ఎప్పుడు విడుదల చేయాలి ఎలా ప్రమోట్ చేయాలి అన్న విషయాల పై ఇంకా తనకు తానె క్లారిటీ తెచ్చుకోలేని ఒక విచిత్ర అయోమ పరిస్థితుల మధ్య మహేష్ ‘బ్రహ్మోత్సవం’ విషయమై తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు టాక్. దీని వల్లనే ‘బ్రహ్మోత్సవం’ విడుదల తేదీ పై ఇంకా క్లారిటీ రావడం లేదు అని అంటున్నారు..