పవన్‌ కళ్యాణ్ లండన్ లో పాల్గొన్న ‘ఉక్తా’ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాలలో అతడి కొత్త గెటప్ ను చూసి లండన్ లోని పవన్ అభిమానులు చాల ఆనందపడినట్లు టాక్. గతంలో ఎస్.జె. సూర్యా దర్శకత్వంలో నిర్మించబోయే సినిమాకు సంబంధించి బయట పడ్డ లుక్ కు ఇప్పుడు డాలీ డైరెక్షన్ లో  కనిపించబోతున్న కొత్త సినిమా లుక్ కు విపరీతమైన తేడాలు కనిపించడంతో లండన్ లోని పవన్ అభిమానులు విపరీతమైన జోష్ లోకి వెళ్ళి పోయినట్లు టాక్. 

మీసం మెలేసి కొత్త లుక్‌లో పవన్ సూపర్బ్‌గా ఉన్నాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో పడిపోతున్నాయి. సీమ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాకు పవన్ తన వయస్సుకు తగ్గట్టుగా సరైన లుక్ ను ఎంచుకున్నాడని పవన్ ఆకాశంలోకి ఎత్తేస్తూ పవన్ వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమా షూటింగ్ ఆగష్టు 4 లేదా 5 నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ వుందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా వేదిక పైకి ఎక్కి పెద్దగా ఉపన్యాసాలు చేయని పవన్ కళలు సంస్కృతిలో ఒక అంతర్భాగమని చెప్పుతూ మన తెలుగు సంప్రదాయాల్ని భావితరాలకు పరిచయం చేయడానికి తాను బ్రాండ్ అంబాసిడర్ గా మారుతాను అని కామెంట్స్ చేసాడు. 

అయితే పవన్ చేసిన ఈ కామెంట్స్ వెనుక చాల అర్ధాలు ఉన్నాయి అని అంటున్నారు. పవన్ అన్ని వర్గాల వారిని వయస్సుతో సంబంధం లేకుండా ఆకర్షించడానికి తన వంతు ప్రయత్నాలు చాల గట్టిగా చేస్తున్నట్లే అనుకోవాలి. ప్రస్తుతం మీడియాకు మాత్రం పవన్ లేటెస్ట్ గెటప్ హాటాపిక్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: