ఆగస్టు 1న పుట్టిన అందాల తార తాప్సీ ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత చాలా సినిమాల్లో నటించినా ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. అయినా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలకేం కొదవ లేదు.
తాజాగా తాప్సీ గుండెల్లో గోదారి అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తుంది. లక్ష్మీ నిర్మించిన ఊకొడతరా.. ఉలిక్కిపడతారా ఇటీవలే విడుదల అయ్యింది. ఇందులో నటించిన దీక్షాసేధ్ కు మరోసారి నిరాశనే మిగిల్చింది. ఈ ‘ఊకొడతారా..‘ చూసిన వారు బాలయ్య, లక్ష్మీ ప్రసన్నల గురించే మాట్లాడుతున్నారు కానీ, దీక్షాసేథ్ ను పట్టించుకోవడం లేదు.
మరీ ఈ గుండెల్లో గోదారితో తాప్పీని లక్ష్మీ ప్రసన్న ఏం చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: