రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన హీరో జీవా. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి కుమారుడైన జీవా తన తండ్రి భారీ ఎత్తున నిర్మిస్తున్న ముగమూడి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మాస్క్ అనే పేరుతో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 12న మాస్క్ ఆడియో విడుదల చేస్తున్నట్లు, సినిమాను 31న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అన్నట్లు ఈ సినిమాలో పూజాహెగ్డే జీవాకు జతగా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: