‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మొదటిరోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో నందమూరి అభిమానులు ఆనందంతో మీసం మెలి వేస్తున్నారు. అయితే ఈసినిమాలోని ‘దేశం కోసం మీసం మెలేద్దామా’ అన్న డైలాగ్ పై రాజకీయ రచ్చ జరుగుతోంది. దేశం అంటే తెలుగుదేశమా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.
సినిమా ట్రైలర్ దగ్గర నుంచినే పాపులర్ అయిన ఈ డైలాగ్ గురించి మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈసినిమాలో తాను వాడిన డైలాగ్ ‘దేశం’ అంటే తెలుగుదేశం కాదని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు బాలయ్య. ఈ ఊహలు అన్నీ కొందరి సృష్టి మాత్రమే అంటూ ఈ విషయం పై వస్తున్న కామెంట్స్ ను ఖండించాడు బాలకృష్ణ.
ఇది ఇలా ఉండగా ఈసినిమా నిర్మాతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం ‘శాతకర్ణి’ యూనిట్ ఆద్వర్యంలో ప్రత్యేకంగా షో వేసారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు దర్శకుడు క్రిష్ హీరోయిన్ శ్రియ తదితరులు హాజరయ్యారు. క్రిష్ మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కోసం కూడా ఈ సినిమా ప్రత్యేక షోను వేయనున్నామని అన్నాడు.
నిన్న రాత్రి ‘శాతకర్ణి’ సినిమా పై ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన చర్చా గోష్టిలో పాల్గొన్న వక్తలు కొన్ని ఆశ్చర్యకర విషయాలను బయట పెట్టారు. వాస్తవానికి క్రిష్ తీసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తెలుగువాడు కాడని మహారాష్ట్రా ప్రాంతానికి చెందిన రాజు అని మరో వాదాన్ని తెరపైకి తీసుకు వచ్చారు.
అంతేకాదు ‘శాతకర్ణి’ మహారాజు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని కొందరు చెపుతూ ఈసినిమాలో చరిత్రకంటే యుద్ధాలు ఎక్కువగా క్రిష్ చూపించారు అన్న కామెంట్స్ చేసారు. అయితే బాలకృష్ణ 100వ సినిమా కాబట్టి క్రిష్ చరిత్ర కంటే యోధుడుగా బాలకృష్ణను ఎలివేట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి