మిస్టర్ ఆడియో ఎప్పుడంటే : 


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల డైరక్షన్ లో వస్తున్న సినిమా మిస్టర్. కమర్షియల్ సినిమాల హడావిడిలో పడి తన మార్క్ లవ్ స్టోరీలను ఇవ్వడం మర్చిపోయిన శ్రీనువైట్ల డైరక్షన్ లో వస్తున్న ఈ మిస్టర్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాబట్టింది.


ఇక ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియోని మార్చి 30న రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. నల్లమలపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో హెబ్భా పటేల్, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


పూరి సినిమాలో గ్యాంగ్ స్టర్  బాలయ్య : 


నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాధ్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉనిది. సినిమాలో బాలయ్య ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడని టాక్. ఫ్లాపుల్లో ఉన్నా సరే పూరి చెప్పిన కథ నచ్చడంతో బాలయ్య ఓకే చెప్పాడు.


ఇక తన సినిమాల్లో హీరోలకుండే స్పెషల్ క్రేజ్ కు ఏమాత్రం తగ్గకుండా బాలయ్యతో సినిమా చేస్తున్నాడట పూరి. ఇక తన డైరక్షన్ లో వస్తున్న రోగ్ ఈ నెల చివరన రిలీజ్ అవనుంది.


రాయుడు ఫార్టీ ప్లస్ బట్ : 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మూవీ శుక్రవారం రిలీజ్ అయ్యి మిక్సెడ్ టాక్ తో రన్ అవుతుంది. ఇక పవర్ స్టార్ స్టామినా ప్రూవ్ చేస్తూ మొదటి మూడు రోజుల్లో మొదటి వీకెండ్ లో మాత్రం దాదాపు 35 నుండి 40 కోట్ల దాకా షేర్ కలక్షన్స్ వసూళ్లు చేసింది కాటమరాయుడు మూవీ.


అయితే ప్రీ రిలీజ్ లో 80 నుండి 90 కోట్లు రాబట్టిన కాటమరాయుడు హిట్ అనాలంటే మాత్రం మరో 40 రాబట్టాల్సిందే. సినిమా ఆ రేంజ్ వసూళ్లను రాబడుతుందో లేదో చూడాలి.


మెగా పవర్ స్టార్ బర్త్ డే వేడుకలు :


మెగా పవర్ స్టార్ రాం చరణ్ పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా మెగా ఫ్యాన్స్ మధ్యలో జరిగింది. ప్రస్తుతం చరణ్ అమెరికాలో ఉండగా మెగా ఫ్యాన్స్ అంతా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద కేక కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీం హీరో సాయి ధరం తేజ్, నిర్మాత అల్లు అరవింద్ అటెండ్ అయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: