ప్రముఖ సిని దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు వచ్చినట్టు ఎక్స్ క్లూజివ్ న్యూస్. మధ్యాహ్నం సమయంలో మణిరత్నంకు గుండెపోటు వచ్చిందట. వెంటనే చెన్నైలోని అపోలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యులు ప్రత్యేక చికిత్స చేస్తున్నారని తెలుస్తుంది. మణిరత్నంకు గుండెపోటు వచ్చిందని  విషయం తెలుసుని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.   


తమిళ దర్శకుడే అయినా తెలుగులో కూడా స్టార్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నారు మణిరత్నం. ఆణిముత్యాల్లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన మణిరత్నం క్షేమంగా ఇంటికి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం చెక్క చివంత వనం సినిమా డైరెక్ట్ చేస్తున్నారు.  


ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆ సినిమాను తెలుగులో నవాబ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో మణిరత్నం చేసిన రోజా, దళపతి, నాయకుడు, బొంబాయి, గురు వంటి సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఓకే బంగారం సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన మణిరత్నం ఎంతమంది దర్శకులు వచ్చినా తన మార్క్ చూపిస్తూ వచ్చారు.   


అభిరుచి గల దర్శకుడిగా మణిరత్నం తన ప్రతిభ చాటుతూ వచ్చారు. సౌత్ సినిమాల్లో తన ప్రత్యేకతని చాటుకుంటూ వస్తున్నారు. దిగ్గజ దర్శకుల పేరు ప్రస్థావనలో మణిరత్నం పేరు ఎప్పుడు వినపడుతూనే ఉంటుంది. ఆయన సినిమాలో పాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: