దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అంతా కొత్త వాళ్లతో రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే, లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ సినిమలో శ్రియా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం ఉండేది. అయితే ఇప్పడు తొలిసారిగా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో శ్రియ ఉన్న స్టిల్స్ ను విడుదల చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కు శ్రియ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని చిత్ర యూనిట్ అంటుంది. కాగా, కొద్దికాలం క్రితం వరకూ నెంబర్ వన్ హీరోయిన్ రేస్ లో శ్రియకు ఇప్పడు అవకాశాలు పెద్దగా లేవు. ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో తనకు పూర్వవైభవం వస్తోందని శ్రియా ధీమగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: