రోబో సీక్వల్ గా భారీ అంచనాలతో వచ్చిన సినిమా 2.ఓ. శంకర్, రజిని లాంటి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన శివాజి, రోబో రెండు సూపర్ హిట్ అయ్యాయి. 2010లో వచ్చిన రోబో అయితే బాక్సాఫీస్ పై తన సత్తా చాటింది. చిట్టి రోబో చేసిన విన్యాసాలకు కలక్షన్స్ అదిరిపోయాయి. ఇక ఇప్పుడు ఆ సినిమా సీక్వల్ గా 2.ఓ వచ్చింది. 


అయితే అమెరికాలో ప్రీమియర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇండియాలో మొదటి ఆటకు ఓకే అన్న టాక్ తెచ్చుకుంది. అయితే మధ్యాహ్నం ఆటకు టాక్ తేడా రావడం విశేషం. సినిమాలో విఎఫెక్స్ ఎఫెక్ట్స్ బాగున్నాయని చెబుతుండగా కథ పెద్దగా ఆకట్టుకునేలా లేదు అన్నది కొందరి మాట.


రోబో సినిమాలో కథ, విజువల్ ఎఫెక్ట్స్ రెండు బాగా కుదిరాయి. 2.ఓలో కథ సోసోగా అనిపిస్తుందని అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మరోసారి శంకర్ తన మార్క్ చూపించాడని చెప్పుకుంటున్నారు. అయితే టాక్ బాగున్నా ఈ మిక్సెడ్ టాక్ వల్ల కలక్షన్స్ డ్రాప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


చెన్నైలో సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో మాత్రం మిక్సెడ్ టాక్ నడుస్తుంది. అయితే అంచనాలు భారీగా  పెట్టుకోవడం వల్లే సినిమా అద్భుతంగా ఉన్నా సరే ఇంకా ఏదో ఉంటుందని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. అంతేతప్ప 2.ఓ రోబోకి పర్ఫెక్ట్ సీక్వల్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు సెల్ ఫోన్స్ ఎక్కువ వాడొద్దని శంకర్ ఇచ్చిన మెసేజ్ కూడా బాగుందని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: