తెలుగులో ఎప్పుడూ హీరోయిన్స్ కొరత ఉండనే ఉంటుంది. తెలుగు అమ్మాయికి సినిమాల్లో నటించడానికి ఇష్టపడరు అయితే అది ఒకప్పుడు ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు టాలెంటెడ్ హీరోయిన్స్ కు మంచి అవకాశాలే వస్తున్నాయి. ఎంత వచ్చినా సరే తమిళ, మళయాళ, కన్నడ భామల హవానే తెలుగులో కొనసాగుతుంది.


ఒకప్పుడు ముంబై భామలతో కళకళలాడే తెలుగు పరిశ్రమ వారిని కాదని మళయాళ, కన్నడ భామల మీద పడ్డారు. అందం అభినయం రెండు కలగలిపి ఉన్న ముద్దుగుమ్మలు తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటున్నారు. ఇదిలాఉంటే తెలుగులో స్టార్ ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కొణిదెల నిహారిక. 


మెగా కాంపౌండ్ నుండి వచ్చిన ఈ అమ్మడు తన మార్క్ సినిమాలతో ఆకట్టుకోవాలని అనుకున్నా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఆమె శివాత్మిక. తల్లిదండ్రులు ఇద్దరు స్టార్సే.. వాళ్లే డాక్టర్ రాజశేఖర్, జీవిత. వారి పెద్ద అమ్మాయి శివాని సినిమా 2 స్టేట్స్ ఏదో గొడవలతో ఆగిపోగా.. చిన్న అమ్మాయి శివాత్మిక దొరసాని సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈమధ్య వచ్చింది.


యువ హీరో.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాను మహిందర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో శివాత్మిక లుక్ అందరిని ఆశ్చర్యపరచింది. కచ్చితంగా ఆమె తెలుగు ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోయే దొరసాని అవుతుందని అంటున్నారు. మరి అక్కకి రాని అదృష్టం చెల్లికి పట్టిందని చెప్పొచ్చు. ఫస్ట్ లుక్ తో ఇంప్రెస్ చేసిన దొరసాని సినిమా హిట్ అయితే శివాత్మిక డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టడం గ్యారెంటీ.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: